రక్షణగా 50 మంది పోలీసులు... 30 మంది బౌన్సర్లు! | 50 policemen... 30 bouncers as security ! | Sakshi
Sakshi News home page

రక్షణగా 50 మంది పోలీసులు... 30 మంది బౌన్సర్లు!

Published Thu, May 15 2014 10:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

రక్షణగా 50 మంది పోలీసులు... 30 మంది బౌన్సర్లు! - Sakshi

రక్షణగా 50 మంది పోలీసులు... 30 మంది బౌన్సర్లు!

ఇటీవల ఓ ప్రముఖ బాలీవుడ్ చానల్‌లో ప్రసారమైన ఓ కథనం... బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది. రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో సోనాక్షి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అందాలభామ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆ పరిసరాల్లో రక్షణ కవచంలా టైట్ సెక్యూరిటీని చిత్రం యూనిట్ ఏర్పాటు చేసిందని, యూనిట్ విజ్ఞప్తి మేరకు యాభై మంది పోలీసులు ఈ షూటింగ్ పరిసరాలను పహారా కాస్తున్నారని, అంతేకాక 30 మంది బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారని ఆ కథనం సారాంశం.

ఇప్పటివరకూ దక్షిణాదిన చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు నటించారు కానీ, ఎవరికీ ఇవ్వనంత సెక్యూరిటీని సోనాక్షికే ఇచ్చారంటే... ఆమె ఇమేజ్‌ని ఎలా అంచనా వేయాలి? అని బాలీవుడ్‌లో అందరూ అనుకుంటున్నారట. అయితే... ఈ కథనాన్ని సోనాక్షి తేలిగ్గా కొట్టిపారేశారు. ‘‘సెక్యూరిటీ ఏర్పాటు చేసిన మాట నిజం. కానీ అది నా కోసం అనుకోవడం అమాయకత్వం. అక్కడ లొకేషన్లో ఉంది సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆ మాటను మరిచిపోతే ఎలా’’ అని అసలు విషయాన్ని బయటపెట్టారు సోనాక్షి. ఈ కథనం గురించే ‘లింగా’ ప్రొడక్షన్ మేనేజర్ సురేశ్ కుమారస్వామి మాట్లాడుతూ -‘‘లొకేషన్లో సూపర్‌స్టార్ ఉన్నారని తెలిస్తే... తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉంటారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీస్ సెక్యూరిటీ సహాయం తీసుకుంటాం. ఇది సూపర్‌స్టార్ ప్రతి సినిమాకూ జరిగే తంతే. అయితే... ఈ దఫా రజనీ సార్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్ కూడా తోడయ్యారు. అందుకే ఈ హంగామా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement