‘లింగ’నమక్కి వద్ద సినిమా షూటింగ్ వద్దేవద్దు | cancel the permission given to the demands | Sakshi
Sakshi News home page

‘లింగ’నమక్కి వద్ద సినిమా షూటింగ్ వద్దేవద్దు

Published Mon, Aug 25 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

cancel the permission given to the demands

  •  చిత్రీకరణకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని పరిసర ప్రేమికులు డిమాండ్
  • శివమొగ్గ :  ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి జలాశయం వద్ద ‘లింగ’ సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న ఈ జలాశయం వద్ద సినిమా చిత్రీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదని పరిసర ప్రేమికులు పేర్కొంటున్నారు.

    చిత్రీకరణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని శివమొగ్గ నగర పరిసర ప్రేమికుల ఒక్కోట అధ్యక్షుడు పరిసర రమేశ్ ఆదివారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కోట్లాదిరూపాయల వ్యయంతో లింగనమక్కిడ్యాం వద్ద ఇప్పటకే సెట్టింగ్‌లు వే శారు.వందలాది మంది కళాకారులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తే ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందనేది చిత్ర నిర్మాణయూనిట్ నిర్వాహకుల భయం. ఈ నేపథ్యంలో ఇక్కడ షూటింగ్‌ను త్వరగా ముగించాలని  నిర్ణయించుకున్నారు.
     
    సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదు
     
    జలాశయం వద్ద సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరైంది కాదని  పరిసర పోరాటదారుడు పరిసర రమేశ్  ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.  లింగనమక్కి డ్యాం ప్రదేశం అత్యంత సూక్ష్మమైందని, ఈ డ్యాం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న నేపథ్యంలో  వీడియో, ఫొటోల చిత్రీకరణను కూడా నిషేధించారని గుర్తు చేశారు. అయితే   సినిమా చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అవైజ్ఞానికమని పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇక్కడ సినిమాల షూటింగ్‌లు నిర్వహించరాదని డిమాండ్ చేస్తూ ఈనెల 26 తేదీన శివమొగ్గ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి మనవి పత్రం అందిస్తామని రమేశ్ పేర్కొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement