Revoked license
-
‘లింగ’నమక్కి వద్ద సినిమా షూటింగ్ వద్దేవద్దు
చిత్రీకరణకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని పరిసర ప్రేమికులు డిమాండ్ శివమొగ్గ : ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి జలాశయం వద్ద ‘లింగ’ సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న ఈ జలాశయం వద్ద సినిమా చిత్రీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదని పరిసర ప్రేమికులు పేర్కొంటున్నారు. చిత్రీకరణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని శివమొగ్గ నగర పరిసర ప్రేమికుల ఒక్కోట అధ్యక్షుడు పరిసర రమేశ్ ఆదివారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కోట్లాదిరూపాయల వ్యయంతో లింగనమక్కిడ్యాం వద్ద ఇప్పటకే సెట్టింగ్‌లు వే శారు.వందలాది మంది కళాకారులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తే ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందనేది చిత్ర నిర్మాణయూనిట్ నిర్వాహకుల భయం. ఈ నేపథ్యంలో ఇక్కడ షూటింగ్‌ను త్వరగా ముగించాలని నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదు జలాశయం వద్ద సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరైంది కాదని పరిసర పోరాటదారుడు పరిసర రమేశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లింగనమక్కి డ్యాం ప్రదేశం అత్యంత సూక్ష్మమైందని, ఈ డ్యాం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న నేపథ్యంలో వీడియో, ఫొటోల చిత్రీకరణను కూడా నిషేధించారని గుర్తు చేశారు. అయితే సినిమా చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అవైజ్ఞానికమని పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇక్కడ సినిమాల షూటింగ్‌లు నిర్వహించరాదని డిమాండ్ చేస్తూ ఈనెల 26 తేదీన శివమొగ్గ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి మనవి పత్రం అందిస్తామని రమేశ్ పేర్కొన్నారు. -
రెండు రోజుల్లో ప్రసారాలను పునరుద్ధరించండి
తెలంగాణ ఎంఎస్‌వోలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రసారాలు నిలిపివేసిన రెండు తెలుగు టీవీ చానళ్లను సోమవారంలోగా పునరుద్ధరించాలని, లేదంటే లెసైన్స్‌లు రద్దు చేస్తామని ఎంఎస్‌వోలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరించారు. పలు రాష్ట్రాల ఎంఎస్‌వోల నాయకులతో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని శాస్త్రిభవన్‌లో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఎంఎస్‌వోలకు పై విధంగా హెచ్చరిక జారీ చేశారు. అంతకు ముందు.. తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాల నిలిపివేతకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని జవదేకర్ రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వమే నిషేధం విధించిందనుకుని తాము నోటీసులు ఇచ్చామని, అయితే నిలిపివేసింది ఎంఎస్‌వోలని తెలంగాణ ప్రభుత్వం సమాధానమిచ్చిందని తెలిపారు. టీవీ ప్రసారాల నిలిపివేతపై స్వల్పకాలిక చర్చకు శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ అనుమతిచ్చారు. టీడీపీ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. అనంతరం మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు.. టీవీ ప్రసారాలకు సంబంధించిన సీడీలను చూపుతూ ఎవరైనా ఆ ప్రసారాలు చూసి మాట్లాడాలని, అందులో వాడిన భాష నీచంగా ఉందని చెప్పారు. ఇదే పత్రికా స్వేచ్ఛ అని ఎవరైనా అంటే.. ‘‘నేనిక్కడే ఉరి తీసుకుంటా’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. చివరగా కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. చానళ్లు నిలిపివేయడం సరికాదని, ఎంఎస్‌వోలతో సమావేశమవుతానని చెప్పారు.