బాలయ్య సరసన మలయాళీ బ్యూటీ | Balakrishna To Romance Natasha Doshi | Sakshi
Sakshi News home page

బాలయ్య సరసన మలయాళీ బ్యూటీ

Published Mon, Sep 4 2017 1:25 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్య సరసన మలయాళీ బ్యూటీ - Sakshi

బాలయ్య సరసన మలయాళీ బ్యూటీ

పైసా వసూల్ సినిమాతో ఆకట్టుకున్న నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమా పనులు కూడా శరవేగంగా ముగించేస్తున్నారు. తమిళ దర్శకుడు కే యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు అందాల భామలు ఆడి పాడనున్నారు. ఇప్పటికే నయనతారను ఓ హీరోయిన్ గా ఫైనల్ చేయగా తాజాగా మరో బ్యూటీని ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమా సెకండ్ హీరోయిన్ గా నటాషా దోషిని ఎంపిక చేశారు. మలయాళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటాషా తెలుగు తెరకు ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నారు. మాలీవుడ్ లో హైడ్ అండ్ సీక్, మాంత్రికన్, నయన, ఫర్ సెల్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. త్వరలోనే నటషా ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నారు. త్వరలోనే మరో హీరోయిన్ వివరాలు కూడా వెల్లడించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement