
బాలయ్య నెక్ట్స్ సినిమా పూరితోనే..?
ఇటీవల తన వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, త్వరలో తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను ఫైనల్ చేసిన బాలయ్య ఏ సినిమాను పట్టాలెక్కించేది ఇంత వరకు కన్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమాను చేయాలని భావిస్తున్నాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో కీలక పాత్రకు అమితాబ్ను సంప్రదించిన చిత్రయూనిట్ ఆయన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అమితాబ్ అంగీకరించపోతే రైతు సినిమా ఉండదని బాలయ్య ఇప్పటికే ప్రకటించేశాడు.
అదే సమయంలో తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య తన నెక్ట్స్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడట. రోగ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న పూరి, కొద్ది రోజులుగా స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. బాలయ్య ఒకే అంటే వీలైనంత త్వరగా సినిమాను ప్రారంభించి, దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.