మరో క్రేజీ ప్రాజెక్ట్లో బాలయ్య..? | Balakrishna movie with Harish Shankar | Sakshi
Sakshi News home page

మరో క్రేజీ ప్రాజెక్ట్లో బాలయ్య..?

Published Tue, Sep 12 2017 10:48 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

మరో క్రేజీ ప్రాజెక్ట్లో బాలయ్య..? - Sakshi

మరో క్రేజీ ప్రాజెక్ట్లో బాలయ్య..?

వందో సినిమా తరువాత స్పీడు పెంచిన నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ప్రయోగం చేసిన నందమూరి నటసింహా..  ఆ తరువాత కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 101వ సినిమాగా పూరి జగన్నాథ్ లాంటి డాషింగ్ డైరెక్టర్ తో సినిమా చేసి అందరి షాక్ ఇచ్చిన బాలకృష్ణ, ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 102 సినిమా చేస్తున్నారు.

తరువాత చేయబోయే సినిమాల విషయంలో కూడా కొత్త కాంబినేషన్ లు ట్రై చేస్తున్నాడు బాలకృష్ణ. మాస్ కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో వివాదాలకు తెర తీసిన హరీష్ శంకర్ బాలయ్య కోసం ఎలా కథ రెడీ చేస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement