ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి (88) కన్నుమూశారు. తమిళ చిత్రసీమలో కమర్షియల్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న కేఎస్ రవికుమార్. 1990ల నుంచి ఎన్నో మాస్ కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో టాప్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన టాప్ దర్శకుడిగా గుర్తింపు పొందారు.
కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అనారోగ్యంతో మరణించారని తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని చెన్నైలోని చిన్నమలై ప్రాంతంలోని దర్శకుడు కేఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2:30గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన తల్లి మరణించినట్లు సోషల్‌మీడియాలో ఆయన ప్రకటించిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రుక్మిణి అమ్మాళ్ మృతదేహానికి వారు నివాళులు అర్పిస్తున్నారు.
కె.ఎస్.రవికుమార్. 1990లో వచ్చిన 'పురియాద పూజ' తమిళ్ సినిమాతో తన జర్నీ ప్రారంభించారు. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో బాలకృష్ణతో జైసింహా,రూలర్ వంటి సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు.
— K.S.Ravikumar (@ksravikumardir) December 5, 2024
Comments
Please login to add a commentAdd a comment