షూటింగ్‌లకు విశాఖ అనువైన ప్రదేశం | c kalyan visited in Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లకు విశాఖ అనువైన ప్రదేశం

Published Sun, Nov 5 2017 1:21 PM | Last Updated on Sun, Nov 5 2017 1:21 PM

c kalyan visited in Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple - Sakshi

సింహాచలం: సినిమా షూటింగ్‌లకు విశాఖ ఎంతో చక్కనైన ప్రదేశమని, రానున్న రెండు మూడేళ్లలో ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్‌లు జరుగుతాయని, ఆ విధంగా పరిశ్రమని అభివృద్ధి చేయబోతున్నామని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. కప్ప స్తంభానికి మొక్కుకుని స్వామికి అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బాలకృష్ణ హీరోగా తాను నిర్మిస్తున్న జై సింహా సినిమా విశేషాలను తెలిపారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఫిల్మ్‌ ఇండస్ట్రీస్‌కి ఫైవ్‌స్టార్‌ ఫెసిలిటీస్‌తో వృద్ధాశ్రమాలు ఉండాలని భావిస్తున్నానన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement