
జనార్థన మహర్షి
‘దేవస్థానం, విశ్వదర్శనం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన జనార్థన మహర్షి తన తర్వాతి చిత్రాన్ని ‘పిబరే రామరసం’ పేరుతో తెరకెక్కించనున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు జనార్థన మహర్షి పుట్టినరోజు సందర్భంగా ‘పిబరే రామరసం’ విశేషాలను తెలుపుతూ– ‘‘రామ రావణుల యుద్ధం జరిగిన వందేళ్ల తర్వాత లంకలోని రాక్షస స్త్రీలు తమ బిడ్డలకు సీతారాముల కథని చెబుతారు. తర్వాతి తరాలలో రాక్షస గుణాలను ఎలా తొలగించారు? అనే అంశంపై కథ ఉంటుంది. రాక్షసులు తనివి తీరా తాగి, తరించిన రామరసమే ఈ ‘పిబరే రామరసం’’ అన్నారు. ‘‘రామాయణసారంతో రూపొందనున్న ఈ చిత్రంలో సీత పాత్రను ఓ ప్రముఖ హీరోయిన్ చేస్తారు. త్వరలో ఇతర విశేషాలు తెలియజేస్తాం’’ అని సి.కల్యాణ్ అన్నారు.