Producers Council President C Kalyan Respond On Mohan Babu Comments: ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో రచ్చకు దారి తీసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో లెవనెత్తిన అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. మా ఎన్నికల అనంతరం దీని ఊసే మరిచిపోయిన క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానంటూ ఆయన చెప్పిన అనంతరం మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది.
చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్
అప్పటి నుంచి పరిశ్రమకు పెద్ద ఎవరనే దానిపై సినీ ప్రముఖులు ఎవరి అభిప్రాయాన్ని వారు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు సినీ పరిశ్రమకు రాసిన లేఖలో ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నిర్మాతలు.. డిస్ట్రీబ్యూటర్లు కాదన్నారు. అంతేగాక టికెట్ల విషయంలో అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదంటూ నిర్మాతల్లో ఐక్యత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్ స్పందించారు.
చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ..
ఆయన మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. ఆయన ముందుండి సమస్యని పరిష్కరిస్తానంటే ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అన్నారు. అయితే మోహన్ బాబు కూడా నిర్మాతే. అయన కొడుకు కూడా నిర్మాతే. ఈ సమస్యల్ని ముందుండి పరిస్కరిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటాం’ అని అన్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment