Producers Council President
-
దిల్రాజును తప్పుదారి పట్టించారు, దుష్ప్రచారం చేస్తున్నారు : సి. కల్యాణ్
సినిమా షూటింగ్స్ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. దిల్‌రాజు, సి. కల్యాణ్ ప్యానెల్ వేరు వేరే కాదని, నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దిల్ రాజుతో తనను పోలుస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు సుమారు 80 చిన్న సినిమాలు తీశానని, ఎవరిని మోసం చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. ప్రొడ్యూసర్ గిల్ట్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. గిల్డ్‌లో 27 మంది సభ్యులున్నారు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలనే నిర్మాతల మండలి పరిష్కరించింది. 2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్ , నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా రేపు(ఫిబ్రవరి 19)న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరగనున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సి. కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు
Producers Council President C Kalyan Respond On Mohan Babu Comments: ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం ప్రస్తుతం టాలీవుడ్లో రచ్చకు దారి తీసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో లెవనెత్తిన అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. మా ఎన్నికల అనంతరం దీని ఊసే మరిచిపోయిన క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానంటూ ఆయన చెప్పిన అనంతరం మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్ అప్పటి నుంచి పరిశ్రమకు పెద్ద ఎవరనే దానిపై సినీ ప్రముఖులు ఎవరి అభిప్రాయాన్ని వారు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు సినీ పరిశ్రమకు రాసిన లేఖలో ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నిర్మాతలు.. డిస్ట్రీబ్యూటర్లు కాదన్నారు. అంతేగాక టికెట్ల విషయంలో అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదంటూ నిర్మాతల్లో ఐక్యత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్ స్పందించారు. చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ.. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. ఆయన ముందుండి సమస్యని పరిష్కరిస్తానంటే ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అన్నారు. అయితే మోహన్ బాబు కూడా నిర్మాతే. అయన కొడుకు కూడా నిర్మాతే. ఈ సమస్యల్ని ముందుండి పరిస్కరిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటాం’ అని అన్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. -
ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు
గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఛార్జీల చెల్లింపును రద్దు చేయడంతో పాటు ఆ తర్వాతి నెలల బిల్లును వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు కల్పిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీలో షూటింగ్స్ కోసం పర్మిషన్ కావాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ ప్రసాద్... ఇలా చాలామంది వెళ్ళి గత జూన్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాం. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. మేం తొమ్మిది నెలల కరెంట్ ఛార్జీలు రద్దు అడిగాం. అయితే ప్రభుత్వం మూడు నెలలు రద్దు చేస్తూ, జీవో ఇచ్చింది. మిగతా నెలల బిల్లును కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నది వైఎస్ గారి డ్రీమ్. దానికి సంబందించిన అన్ని విషయాలూ పరిశీలిస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి. వీరనారాయణ్ బాబు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడుతూ – ‘‘ఏ, బీ సెంటర్స్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.10 లక్షలు, సి సెంటర్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.5 లక్షల రుణాలపై వడ్డీ 50 శాతం మాఫీ చేయడం మంచి నిర్ణయం. ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం 6 నెలల గడువు తర్వాత ఒక ఏడాది వరకు వడ్డీ ఉపసంహరణ వర్తిస్తుంది. థియేటర్స్ వారికి వెసులుబాటు కల్పించడంతో పాటు వేలాది సినీ కార్మికులకు తగిన జీవనోపాధి కలిగించేలా చేసిన జగన్ గారికి ధన్యవాదాలు. ఈ విషయాల్లో మాకు సహకరించిన హీరోలు చిరంజీవి, నాగార్జునలకు, మంత్రి పేర్ని నాని, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్, విజయ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
విశాల్.. రాజీనామా చెయ్ !
సాక్షి, పెరంబూరు: నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని డిమండ్ చేస్తూ నటుడు, దర్శకుడు చేరన్ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా హీరో విశాల్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్‌పై దండెత్తడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధమైంది. పోరాటం చేస్తాం: హీరో, దర్శకుడు చేరన్ విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో గొంతు విప్పారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్ వ్యాపార గర్రంగా మారారని ఆరోపించారు. అప్పుడు కరుణానిధి.. ఇప్పుడు..! దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో గెలవగానే డీఎంకే నేత కరుణానిధిని కలిసి ఆశీస్సులు అందుకున్న విశాల్ ఇప్పుడు ఎంజీఆర్, జయలలిత సమాధులకు నివాళులర్పించి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సోమవారం నామినేషన్ దాఖలు చేయడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. విశాల్ చర్యలకు నడిరోడ్డున పడేది నిర్మాతలేనని పేర్కొన్నారు. ఇకపై నిర్మాతలకు పార్టీ, ప్రభుత్వాల నుంచి సహాయం అందదని పేర్కొన్నారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ నిర్మాతలకు మేలు చేసిందేమీ లేదని అరోపించారు. రాజకీయ లబ్ధి: ఆ పదవిని అడ్డు పెట్టుకుని తను రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా నిర్మాతల శ్రేయస్సు కోరితే వెంటనే నిర్మాతల మండలి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్కే.నగర్లో నామినేషన్ దాఖలు చేసిన సాయంత్రం నుంచే విశాల్‌కు వ్యతిరేకంగా నిర్మాతలందరం కలిసి పోరాటం చేస్తామని లేఖలో హెచ్చరించారు. అనంతరం లేఖను నిర్మాతల మండలిలో సమర్పించి మీడియాతో మాట్లాడారు. -
ఏపీ ఫిలిమ్ చాంబర్ నిర్ణయాలు మార్చుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ చాంబర్‌ను తెలుగు ఫిలిమ్ చాంబర్‌గా మార్చాలన్న ఆలోచనను, ఫిలిమ్ చాంబర్‌కు సంబంధించిన సర్వసభ్య సమావేశాలను విజయవాడ, వైజాగుల్లో పెట్టాలన్న నిర్ణయాలను వెంటనే మార్చుకోవాలని తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ఈ విషయమై 40 మంది నిర్మాతల సంతకాలతో కూడిన ఓ మెమరాండంను ఏపీ ఫిలిమ్ చాంబర్లో సమర్పించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి మాట్లాడుతూ -‘‘మోసపూరితంగా ఏపీ ఫిలిమ్ చాంబర్ పేరుని తెలుగు ఫిలిమ్ చాంబర్‌గా మార్చడానికి కొంతమంది పెద్దలు ప్రయత్నిస్తున్నారు. గతంలో మేం అడ్డుకున్నాం. మళ్లీ అటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలాగే సర్వసభ్య సమావేశాలను వైజాగ్, విజయవాడల్లో పెట్టాలనుకోవడం నిబంధనల ప్రకారం చెల్లవు. కాబట్టి విభేదాలకు వెళ్లకండి. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే మా పోరాటం సమాజంలో ఉన్న అన్ని సంఘాలకు విస్తరిస్తే మీరే నష్టపోతారు. కాబట్టి చాంబర్ పెద్దలు సత్వరమే స్పందించి తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు.