టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సి కల్యాణ్ పేరుతో షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment