
ఒక రోజు ఏం జరిగింది?
యువనటుడు శ్రీకాంత్, గీతాంజలి, జే ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఒక రోజు’. ‘ఏం జరిగింది’ అనేది ఉపశీర్షిక. తడకల రాజేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యువనటుడు శ్రీకాంత్, గీతాంజలి, జే ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఒక రోజు’. ‘ఏం జరిగింది’ అనేది ఉపశీర్షిక. తడకల రాజేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.కల్యాణ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, శక్తి రమేష్‌కి అందించారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన కొడాలి వెంకటేశ్వరరావు, రామసత్యనారాయణ, మోహన్ వడ్లపట్ల, ముత్యాల రాందాసు సినిమా విజయంపై ఆకాంక్ష వెలిబుచ్చారు.
ప్రేమ, ప్రణయం, హాస్యం మేళవించిన వినోద భరిత చిత్రమిదని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని రాజేష్ తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.