ఐదుగురు ప్యారలల్ మనుషుల మధ్య జరిగే 'మరో ప్రపంచం'.. | Maro Prapancham Trailer Released By Producer C Kalyan | Sakshi
Sakshi News home page

Maro Prapancham: మనలో డిఫరెంట్‌ మెంటాలిటీస్‌ ఉంటాయి: నిర్మాత

Published Mon, Jul 11 2022 6:56 PM | Last Updated on Tue, Jul 12 2022 12:34 AM

Maro Prapancham Trailer Released By Producer C Kalyan - Sakshi

Maro Prapancham Trailer Released: చక్ర ఇన్ఫోటైన్‌మెంట్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై కిలారు నవీన్ దర్శకత్వంలో నిర్మాత వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన తారాగణంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరెక్కింది. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అలాగే మరో గెస్ట్‌ సాగర్ కె చంద్ర, సాయి కిరణ్‌ అడివి సినిమా పోస్టర్ లుక్‌ను రిలీజ్‌ చేశారు. 

నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఈ ట్రైలర్ చూపించాడు. నాకు నచ్చి ఈ కార్యక్రమానికి వచ్చాను. మనందరిలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి.. అలాంటిది ఓ ఐదుగురి ప్యారలల్ లైఫ్‌లో అలాంటి మార్పులు జరిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి ప్రయోగం. అలానే  క్వాలిటీ‌తో చిత్రీకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఆర్ ఆర్.. సినిమాకు హైలెట్ అవుతుందని అనుకుంటున్నా. ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని.. అలాగే నిర్మాతకు, డైరెక్టర్, ఆర్టిస్టులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. 

చదవండి: ధనుష్‌ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్‌ దర్శకులు..

ప్రొడ్యూసర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. ‘‘కష్టం అంతా దర్శకుడు నవీన్‌దే. నేను జస్ట్ డబ్బు పెట్టాను అంతే. సబ్జెక్ట్ అండ్ ఆర్టిస్టులను నమ్మాను.. వారందరూ 200 పర్సెంట్ న్యాయం చేశారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దవాళ్లు  చెబుతుంటారు.. దాన్నే లీడ్ తీసుకొని 5 ప్యారలల్ మనుషులు మధ్య జరిగే కథే మరో ప్రపంచం. గుడ్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ''ప్యారలల్ యూనివెర్సల్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం. టీమ్ అంతా కొత్తవారే అయినా ప్రొడ్యూసర్ సినిమా చేయడానికి ముందుకు రావడం సంతోషం. ఇంకో మూవీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు.. అందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని మాటిస్తున్నా'' అని డైరెక్టర్‌ నవీన్‌ తెలిపారు. 

చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement