చక్రి వాయిస్ ఇష్టం..ఐ మిస్ హిమ్
హైదరాబాద్ : ఇంత చిన్న వయసులోనే చక్రి మృతి చెందటం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఆయన సోమవారం చక్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఎర్రబస్సు చిత్రానికి చక్రి సంగీతం అందించాడని, నిజంగా ఇన్నిరోజులు అతన్ని ఎందుకు మిస్ అయ్యానా అని అనుకున్నట్లు చెప్పారు.
భవిష్యత్లో అతనితో మరిన్ని సినిమాలు చేయవచ్చు అని అనుకున్నానని.. అయితే హఠాత్తుగా చక్రి జీవితం ఇలా ముగిసిపోతుందని అనుకోలేదన్నారు. చక్రి తనను తండ్రిగా భావించేవాడని, చివరి రోజుల్లో చాలా దగ్గరగా కలిసి ఉన్నామని దాసరి అన్నారు. చక్రీ వాయిస్ అంటే తనకు చాలా ఇష్టమని.. చక్రి వాయిస్ వినిపించడయ్యా అని అనేవాడినని..స్నేహపాత్రుడు...అందరికి కావలసినవాడు అని ...ఐ మిస్ హిమ్ అని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.