‘టామీ' లాంటి చిత్రాలు రావాలి!
- దాసరి నారాయణరావు
‘‘నిర్మాత హరిరామజోగయ్యగారు మంచి అభిరుచితో ‘టామీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సీత, ఎల్బీ శ్రీరామ్, భూగీ అనే కుక్క ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టామీ'. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. చక్రి స్వరాలందించారు. బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామజోగయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ ‘‘30 రోజుల్లో సినిమాళ పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్ ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఆయన డెడికేషన్, కమిట్‌మెంట్ అలాంటిది’’ అన్నారు. ప్రివ్యూను మార్చి 1న వైజాగ్‌లో ప్రదర్శిస్తామనీ, లాభాన్ని కుక్కల క్షేమం కోసం వినియోగిస్తామని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్, అమల, కోడి రామకృష్ణ, శివాజీ, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.