Dr Rajendra Prasad
-
నిర్లక్ష్యంగా ఉంటే కరోనా కాటు తప్పదు
-
సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది
‘‘క్రికెట్ నేపథ్యంలో విభిన్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆటల నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది. ఆ కోవలోనే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అని చిరంజీవి అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. ‘ది క్రికెటర్’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఎ.వల్లభ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే కథతో ఈ సినిమా ఉంటుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. ఐశ్వర్యా రాజేష్ నాలుగైదు నెలలు క్రికెట్లో శిక్షణ తీసుకొని నటించారంటే, ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్ అది. తను ఎవరో కాదు.. మా కొలీగ్ రాజేష్ కూతురు.. కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్ రావడం శుభపరిణామం. భీమనేనికి ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘క్రీడల నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా, స్క్రీన్‌ప్లే, సబ్జెక్ట్ పరంగా మా సినిమా విభిన్నమైంది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘40 సంవత్సరాలుగా చిరంజీవికి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెల్సిందే. ఒక గొప్ప సినిమా అయిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను లాంచ్ చేసిన చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ఈ సంవత్సరం రాబోయే గొప్ప సినిమాల్లో కచ్చితంగా మా సినిమా ఒకటి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు. ∙కేయస్ రామారావు, చిరంజీవి, భీమనేని శ్రీనివాసరావు -
‘టామీ' లాంటి చిత్రాలు రావాలి!
- దాసరి నారాయణరావు ‘‘నిర్మాత హరిరామజోగయ్యగారు మంచి అభిరుచితో ‘టామీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సీత, ఎల్బీ శ్రీరామ్, భూగీ అనే కుక్క ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టామీ'. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. చక్రి స్వరాలందించారు. బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామజోగయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ ‘‘30 రోజుల్లో సినిమాళ పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్ ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఆయన డెడికేషన్, కమిట్మెంట్ అలాంటిది’’ అన్నారు. ప్రివ్యూను మార్చి 1న వైజాగ్‌లో ప్రదర్శిస్తామనీ, లాభాన్ని కుక్కల క్షేమం కోసం వినియోగిస్తామని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్, అమల, కోడి రామకృష్ణ, శివాజీ, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. -
కోడి ఏమైంది...
నాని అంటే రాజుగారి ఇంట్లో కోడి పేరు. ఆ ఇంట్లో అందరికీ నాని అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రాజుగారి మనవరాలు బంగారానికి చాలా ఇష్టం . ఓ రోజున అది హఠాత్తుగా కనిపించకుండా పోయింది. మొత్తం ఇంటిల్లిపాది బెంగపెట్టుకున్నారు. అసలు నాని ఏమైంది...? ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దాగుడు మూత దండాకోర్ ’. తమిళంలో విజయవంతమైన ‘శైవం’ చిత్రం ఆధారంగా రామోజీరావు, దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్.కె. మలినేని దర్శకుడు. ఇ ఎస్. ఎన్. మూర్తి సంగీత దర్శకుడు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం పాటల వేడుక శుక్రవారం ఆర్ఎఫ్సీలో జరిగింది. క్రిష్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తుంది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది’’అని చెప్పారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి ఇక్కడికి రాలేదు, నాలుగు మంచి సినిమాలు చేద్దామని వచ్చా, ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు నిర్మాతలకు నా కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ వేడుకలో రామోజీరావు, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.