రాజధాని విజన్‌ గ్రాఫిక్స్‌లోనేనా? | kommineni srinivasarao interviewed director dasari narayanarao | Sakshi
Sakshi News home page

రాజధాని విజన్‌ గ్రాఫిక్స్‌లోనేనా?

Published Wed, Feb 1 2017 2:29 AM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

రాజధాని విజన్‌ గ్రాఫిక్స్‌లోనేనా? - Sakshi

రాజధాని విజన్‌ గ్రాఫిక్స్‌లోనేనా?

కొమ్మినేని శ్రీనివాసరావుతో దర్శకరత్న దాసరి నారాయణరావు

రాజధానిని గ్రాఫిక్స్‌లో అందంగా చూపించడం మంచిదే కానీ అమరావతిని మన తరంలో చూడలేమన్నదే వాస్తవమని ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అందమైన, గౌప్పదైన రాజధానిని నిర్మిస్తామన్న సంకల్పం, విజన్‌ మంచిదే కానీ ఒక్క రాజధానిమీదే పూర్తి కేంద్రీకరణ చేస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అది మేలు చేయదన్నారు. చేసిన వాగ్దానాలను చంద్రబాబు నెరవేర్చలేదు కాబట్టే వచ్చే ఎన్నికల్లో ప్రభు త్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంటుందన్నారు. ముద్రగడ అనే ఉద్యమనేతను  కార్నర్‌ చేసి, ఆసుపత్రిలో పడేసి, టీవీ చూడనీకుండా, పేపరు కూడా చదవనీకుండా, ఎవరూ రాకుండా, కలువకుండా చేసి మానసిక హింసకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. విభజన తనను బాగా గాయపర్చింది కానీ, విభజనానంతరం తెలంగాణలో చాలాబాగా పనిచేస్తున్నారని కితా బిచ్చిన దాసరి నారాయణరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

సినీరంగం.. రాజకీయ రంగం రెండింట్లో భాసిల్లారు. మీ అనుభూతి ఏంటి?
సినీరంగం నా ఊపిరి. ఎందుకంటే 9వ ఏట రంగస్థలం ఎక్కాను. అప్పట్నుంచి నటుడిగా, రచయితగా దర్శకుడిగా కొనసాగుతూ వచ్చాను. ఇక రాజకీయం అంటారా. యాదృచ్ఛికంగా జరిగింది. రాజకీయాల్లోకి వస్తానని, రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘కమ్‌ బ్యాక్‌ టు పవర్‌’ అనే డాక్యుమెంటరీ చిత్రం తోడుగా ఇందిరాగాంధీతో తొలి పరిచయం మొదలుకుని రాజీవ్‌ గాంధీ, సోనియాగాంధీ వరకు రాజకీయాల్లో నా ప్రవేశం పూర్తిగా యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పాలి. రాజ్యసభకు రావడం, కేంద్ర మంత్రిగా పనిచేయడం అన్నీ యాక్సిడెంటల్‌గా జరిగినవే.

మీరు తీసిన తాతామనవడు గొప్ప స్ఫూర్తినిచ్చిన చిత్రం కదా?
ఆ చిత్ర విజయమే దాని స్ఫూర్తి ఎంత గొప్పదో చెబుతుంది. దాని విజయం మామూలు విజయం కాదు.. రెండు కలర్‌ పిక్చర్లు..  ఇద్దరు అగ్రనటుల సినిమాల మధ్య విడుదలైంది. ఎన్టీఆర్‌ చిత్రం దేశోద్ధారకుడు, నాగేశ్వరరావు చిత్రం బంగారుబాబు. రెండు సినిమాల మధ్య ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా విడుదలై 350 రోజులు ఆడిందంటే.. అది ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందో నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా?

ఎన్టీఆర్, చంద్రబాబు.. ముఖ్యమంత్రులుగా వీరిపై మీ అంచనా?
ఎన్టీరామారావుది విశిష్టమైన వ్యక్తిత్వం. సినిమాల్లోనూ, రాజకీయాల్లో కూడా తనది ప్రత్యేకతే. ఆయన నిజంగా బతికుంటే భారతదేశానికి ప్రధాని అయి ఉండే వారు. చాలా స్వచ్ఛమైన వ్యక్తి. కడుపులో ఏమీ ఉండదు. దాచుకోడు. ఓపెన్‌గా ఉంటాడు. ఆ ఓపెన్‌నెస్సే రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసింది. ఇక బాబు గురించి ఇవ్వాళ మాట్లాడనవసరం లేదు. అవసరం వచ్చిన రోజు తప్పక మాట్లాడతాను.

ముద్రగడను పలకరించడానికి వెళితే కూడా మిమ్మల్ని అరెస్టు చేశారు కదా?
మనం ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా, కిర్లంపూడిలో ఉన్న మని షిని చూడ్డానికి ఇన్ని నిబంధనలు, ఆంక్షలు ఉన్నట్లయితే.. అసలు ఏం జరుగుతోంది క్కడ? నిరంకుశ రాజ్యంలో ఉన్నామా. దేశంలో వాక్సా్వతంత్య్రం, భావస్వా తంత్య్రం, స్వేచ్ఛ అన్నీ పోయాయా? వ్యక్తిగతంగా బాబు మీద నాకే వ్యతిరేకతా లేదు. కానీ ముద్రగడను ఆ స్థాయిలో ట్రీట్‌ చేయడానికి ఏ శక్తులు బాబు వెనక పని చేశాయో నాకు తెలీదు కానీ ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. ఒక మనిషిని ఆసుపత్రిలో పడేసి టీవీ చూడనీకుండా, పేపరు కూడా చదవనీకుండా, ఎవర్నీ చెంతకు రానీయకుండా, హింసాత్మకమైన పరిస్థితిని సృష్టిం చడం భరించలేకున్నాను. ఒక వ్యక్తిని కార్నర్‌ చేసి, మానసికంగా హింసించడానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. మీరు రిజర్వేషన్‌ ఇవ్వండి. ఇవ్వకపోండి. దాని గురించి నేను మాట్లాడను, వ్యక్తిగతంగా ఒక పోరాటం చేస్తున్న ఉద్యమకారుడిని ఇలా చేసేస్తే ఎలా అర్థం చేసుకోవాలి? మహాత్మాగాంధీ ఉద్యమం చేసినప్పుడు బ్రిటిష్‌ వాళ్లు మన దేశ స్తులు కారు. మరి వాళ్లేం చేసి ఉండాలి? ఉద్యమానికి మీరు స్వేచ్ఛనివ్వాలి. పాద యాత్రకు వెళతానంటే నేను పంపించనంటే ఎలా?

అమరావతి, భూసేకరణపై మీ అభిప్రాయం?
అమరావతిలో రాజధాని కట్టడమనేది చాలా అవసరం. హైదరాబాద్‌ వంటి రాజ ధానిని కోల్పోయిన తర్వాత అంత గొప్ప రాజధానిని మళ్లీ నిర్మించుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం దాన్ని చేపట్టి పూర్తి చేయాలి కూడా. కాకపోతే రెండు పంటలు పండే ప్రాంతాన్ని బీడుభూములు చేసి, బలవంతంగా లాక్కునికూడా మేం లాక్కోలేదు వాళ్లే మాకు ఇచ్చారు అని చెబుతారా. ఇచ్చిన వారేమో బక్కరైతులు లాగేసుకున్నారు అని వాళ్లు సామాన్యంగా చెప్పగలరా.. పవర్‌ ఈజ్‌ మైటీ. అధికారం ముందు అనా మకులు ఏం మాట్లాడగలరు? కానీ నా ఉద్దేశంలో అమరావతిని మన తరంలో చూడలేం. చాలా సమయం పడుతుంది. దానికి సంబంధించి ఇంకా ఎన్నో వనరులు రావాలి. నిధులు రావాలి. కాగితాలమీద సీజీ వర్క్‌లో ఇది అమరావతి అని గ్రాఫిక్సులో చాలా అందంగా చూపించుకోవచ్చు. కానీ అవన్నీవస్తే అమరావతి చాలా గొప్ప రాజ« దాని అవుతుంది. ఆయన కల, సంకల్పం, విజన్‌ మంచిదే. నేను తప్పు పట్టను. కానీ పూర్తి కేంద్రీకరణ ఒక రాజధానిపైనే పెట్టేస్తే అది రాష్ట్రాభి వృద్ధికి ఎలా ప్రయోజనం చేస్తుంది?

బాబు చేసిన వాగ్దానాలు, రుణమాఫీ వంటి వాటిపై మీ అభిప్రాయం?
ఒక్కమాటలో చెబుతా. చేసిన వాగ్దానాలను బాబు నెరవేర్చలేదు.

రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం?
నాపట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. కలసి పని చేశాం. అలాంటి లీడర్‌ని నేను చూడలేదు. నమ్మిన మనిషికి ప్రాణం ఇస్తారు. మంచివాడా, చెడ్డవాడా, గతంలో తప్పులు చేశాడా, ఒప్పులు చేశాడా అనే విషయం పక్కనబెట్టి తనను నమ్మి వచ్చినవాడికి ప్రాణం ఇచ్చేవారు. అందుకే అంత విశ్వాసం గల మనుషులు ఆయనకు ఏర్పడ్డారు. ఏదైనా చేయాలి అనుకుంటే ఏ రూల్, ఏ సెక్షన్‌ అడ్డువచ్చినా సరే.. చేయాలనుకుంటే చేసేస్తారు. ఒకరిని అడగడం, చర్చిం చడం, దాన్ని పెండింగులో పెట్టడం లాంటివి చేయరు.

ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పనితీరుపై మీ అభిప్రాయం?
వండర్‌ఫుల్‌ పర్సన్‌. గత ఎన్నికల్లో తాను నెగ్గకపోవటం అనేది ఆయన పార్టీకి చాలా బలమైన పునాదిని కల్పించిందనుకుంటున్నాను. ఇప్పుడాయనలో చాలా పరి ణతి కనిపిస్తోంది. ఏ అంశంమీద మాట్లాడినా స్టడీ చేసి పూర్వాపరాల తోటి, గణాంకాల తోటి చెప్పగలిగిన ప్రతిపక్ష నేత జగన్‌. ఇది భవిష్యత్తులో చాలా మంచి చేస్తుంది.

జగన్‌ వర్సెస్‌ బాబు.. దాసరి ఎటు..?
దాసరి ఎటు అనేది తర్వాత చెబు తాను. నడుస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఎవరు క్యాష్‌ చేసుకోగలుగుతారు అనే అంశంపైనే వచ్చే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి.

విభజన తర్వాత ఆంధ్ర ఎలా ఉంది. కేసీఆర్‌ ఎలా ఉన్నారు?
విభజన సమయంలో ఫీలయినమాట వాస్తవం. కానీ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కేసీఆర్‌ చాలా బాగా పనిచేశారు. కేటీఆర్‌ ఆయనకు చాలా పెద్ద సపోర్టర్‌. చిన్నవయసులోనే తనలో పెద్ద పరిపక్వత వచ్చేసింది. ఇక తెలంగాణలో కేసీఆర్‌ చాలా తెలివిగా పగ్గాలు పట్టుకుని వెళుతున్నారు.

కేంద్రంలో మోదీ పాలనపై మీ అభిప్రాయం?
పెద్ద నోట్ల రద్దు వచ్చేంతవరకు నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది. కింది వర్గాలనుంచి వచ్చి ఒక స్థాయిని అందుకుని ఇవ్వాళ భారతదేశాన్నే పాలిస్తున్నారు. కానీ పెద్దనోట్ల రద్దు తొందరపడి చేయలేదు కానీ అవగాహనా రాహిత్యంతో చేశారంటాను . దీనివల్ల సాధించింది ఏమీ లేదు కానీ, పోగొట్టుకున్నది ఎక్కువ.
(దాసరి నారాయణరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం క్లిక్ చేయండి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement