అమ్మ... ఎక్కడైనా అమ్మే | today international mother's day | Sakshi
Sakshi News home page

అమ్మ... ఎక్కడైనా అమ్మే

Published Sat, May 10 2014 10:36 PM | Last Updated on Mon, May 28 2018 4:09 PM

అమ్మ... ఎక్కడైనా అమ్మే - Sakshi

అమ్మ... ఎక్కడైనా అమ్మే

క్రిస్మస్, వాలెంటైన్స్ డే తర్వాత మాతృదినోత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా ఎన్నో దేశాలు జరుపుకొంటున్నాయి.
 
మాతృదినోత్సవాన్ని జరుపుకునే దేశాలు... వివరాలు...

అమెరికా:  అమెరికాలో ఆ రోజున అందరూ తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఉత్సవాలు జరుపుకొంటారు. అమ్మ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. ప్రతి ఇంటిలోనూ జాతీయ పతాకాన్ని  ఆవిష్కరిస్తారు. ఇంటింటా పండగ వాతావరణం నిండిపోతుంది.

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కూడా మాతృదినోత్సవం ఘనంగా జరుపుతారు.

కెనడా:  కెనడా దేశంలో మాతృదినోత్సవం నాడు గులాబీరంగు దుస్తులు ధరిస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు.

న్యూజిలాండ్: న్యూజిలాండ్ దేశంలో మాతృదినోత్సవాన్ని ఒక పెద్ద వేడుకగా  నిర్వహిస్తారు. బహుమతులతో తమ పిల్లలను గౌరవించుకుంటారు. అమ్మమ్మలు, నానమ్మలను కూడా ఆ రోజున గౌరవిస్తారు. కేక్‌లు కోస్తారు. ఆ రోజున తల్లులకు విశ్రాంతి ఇచ్చి, ఇంటి పనులన్నీ పిల్లలే చేస్తారు.

ఐర్లాండు: ఐర్లాండులో మాతృదినోత్సవాన్ని మే నెలలో వచ్చే నాలుగో ఆదివారం, మెక్సికోలో మే నెల పదో తేదీన మాతృదినోత్సవం జరుపుకొంటారు. అన్ని పాఠశాలలలో ఈ వేడుకలను నిర్వహిస్తారు.

భారతదేశం: మన భారతదేశం విషయానికి వస్తే, తల్లిని పూజించే సంప్రదాయం యుగయుగాలుగా ఉంది. రామాయణ, భారత, భాగవతాలలోనూ మనకు తల్లిని గౌరవించే తీరు కనబడుతుంది. ఈ యుగంలోనూ ఎందరో సామ్రాజ్య అధినేతలు తమ తల్లులను ప్రతి సందర్భంలోనూ పూజించేవారున్నారు. దండయాత్రకు వెళ్ళినా, విజయం సాధించి వచ్చినా ముందుగా తల్లినీ, ఆ తర్వాత దైవాన్నీ పూజించేవారు. ఇక ఆధునిక యుగంలో మాతృదినోత్సవం సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఆరంభమైందని చెప్పవచ్చు.

ప్రతి పండగ సమయంలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ తల్లికి పాదాభివందనం చేసే పద్ధతి, ఆచారం మనకు ఉంది. అవన్నీ ఉండగా, ప్రత్యేకించి ఈ మాతృదినోత్సవం చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాల సంస్కృతిగా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు.ఏది ఏమైనా, ఏ దేశంలోనైనా భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారులను తన కడుపులో నవమాసాలు మోసి క్షేమంగా ఈ ప్రపంచానికి అందిస్తున్న అమ్మకు శతకోటి వందనాలు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement