బెంగళూరులో అమ్మ క్యాంటీన్
సాక్షి, బెంగళూరు : స్థానిక కళాసిపాళ్యలోని నాగేశ్వరగార్డన్‌లో ‘అమ్మమెస్’ను అన్నా డీఎంకే రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కే.ఆర్ కృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ రూపాయికి ఒక ఇడ్లీ చొప్పున అమ్మమెస్‌లో విక్రయిస్తారు. నెల రోజుల తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, రాష్ట్రంలోని పేదలకు పౌష్టికాహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చౌకధరల క్యాంటీన్లను ప్రారంభించాలని కృష్ణరాజు పేర్కొన్నారు.
ఈ విషయమై ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వినితిపత్రం అందిస్తామన్నారు. కాగా, తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మమెస్‌లు దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన సంగతి తెలిసిందే.
రూపాయికే ఇడ్లీ
Published Mon, Feb 17 2014 2:09 AM | Last Updated on Mon, May 28 2018 4:09 PM
Advertisement
Advertisement