తమిళనాడులో మరో ద్రవిడ పార్టీ పురుడు పోసుకోనుంది. అన్నాడీఎంకే పగ్గాలను శశికళకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ...
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరో ద్రవిడ పార్టీ పురుడు పోసుకోనుంది. అన్నాడీఎంకే పగ్గాలను శశికళకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ’అమ్మా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’ పేరున పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం. ఈ పార్టీకి ఓ సీనియర్ మంత్రి తెరవెనుక ఉండి సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.
పోయస్‌గార్డెన్‌ను ఖాళీ చేయనున్న శశికళ.. పార్టీలో తనకు అనుకూలమైన వాతావరణం పెరిగి పగ్గాలు చేతికి రావాలంటే పోయస్‌గార్డెన్ ఇంటిని ఖాళీ చేయడం మంచిదని శశికళ భావిస్తున్నారు. ‘ఈ బంగ్లాను స్మారక మండపంగా మార్చేందుకు నేను సిద్ధం. అందుకే ఖాళీ చేయబోతున్నా. జయ మేనకోడలు దీపకు చెందిన ఆస్తులేమైనా ఉంటే అప్పగిస్తా’ అని సన్నిహితులతో శశికళ అన్నట్లు సమాచారం. మరోపక్క అన్నాడీఎంకేను ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ మొదట్నుంచీ విభేధిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ మంగళవారం పోయస్‌గార్డెన్ వెళ్లి శశికళతో భేటీ అవడం చర్చనీయాంశమైంది.