ఇక మార్కెట్ లోకి 'అమ్మ ఉప్పు'
చెన్నై: దిగువ తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఆహారాన్ని అందించే పథకంలో భాగంగా అమ్మ క్యాంటిన్ లను ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత .. మరో కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.
మంగళవారం తమిళనాడు సాల్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రోడక్ట్ కు 'అమ్మ సాల్ట్' నామకరణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అమ్మ సాల్ట్ లో మూడు రకాల ఉప్పును మార్కెట్ లోకి విడుదల చేశారు.
డబుల్ ఫార్టీఫైడ్, రిఫైన్ డ్ ఫ్రీ ఐయోడైజ్డ్, తక్కువ సోడియం రకాలతో అందుబాటులోకి తెచ్చారు. అమ్మ క్యాంటిన్, అమ్మ వాటర్ తర్వాత అమ్మ ఉప్పును సంక్షేమ పథకాల్లో జయలలిత చేర్చారు.