జయలలిత ఆరోగ్యంపై మరో అప్ డేట్! | Jayalalithaa was very well and spent time in hospital, says AIADMK leaders | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 3 2016 1:55 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆ పార్టీ కీలకనేతలు బుధవారం తెలిపారు. ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చిందని, గతంలో మాదిరిగానే ఆమె అందరి ముందుకు త్వరలోనే వస్తారని చెప్పారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ మాట్లాడుతూ.. అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల్లో యథాతథంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని ఆయన దీమా వ్యక్తంచేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానుల పూజలు, ప్రత్యేక ప్రార్థనలు ఫలించి జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement