సైనిక తిరుగుబాటుతో హింస తలెత్తి తీవ్ర ఉద్రిక్తంగా మారిన టర్కీలో 11మంది తమిళనాడు అథెట్లు చిక్కుకున్నారు. టర్కీలో జరుగుతున్న వరల్డ్ స్కూల్ గేమ్స్ మీట్ లో పాల్గొనేందుకు వివిధ స్కూళ్ల నుంచి విద్యార్థినులు వెళ్లారు. ఇంతలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకోవడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తంకాగా.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం వారు క్షేమంగా ఉన్నారని తెలిపింది.