
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యకర్తలు బరితెగించారు. కేవలం బిర్యానీ లేదని చెప్పినందుకు ఓ హోటల్ నిర్వాహకులను చితకబాదారు. డీఎంకే అధినేత, కురువృద్ధుడు ఎం కరుణానిధి ఆరోగ్యం విషమించి.. ఆస్పత్రిలో చేరిన రోజే.. డీఎంకే కార్యకర్తలు ఇలా రౌడీయిజానికి దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చెన్నై విరుగంబాకంలోని ఎస్‌ఎస్ హైదరాబాద్ బిర్యానీ హోటల్‌లో ఐదురోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎంకే కార్యకర్తలు హోటల్‌కు వచ్చి తమకు బిర్యానీ కావాలని ఆర్డర్ చేశారు. అయితే, బిర్యానీ లేకపోవడంతో అదే విషయాన్ని వారికి హోటల్ సిబ్బంది చెప్పారు. దీంతో డీఎంకే కార్యకర్తలు చెలరేగిపోయి.. హోటల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి.. వారిని చితకబాడారు. కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా డీఎంకె కార్యకర్తలను గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలపై డీఎంకే వేటువేసింది.
Comments
Please login to add a commentAdd a comment