hotel staff
-
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్‌లో చూసి ‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
మాస్క్‌లు లేకుండానే హోటళ్లలో వంట
శంషాబాద్: పట్టణంలో కోవిడ్ నింబంధనల అమలుపై అధికారులు దృష్టిసారించకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ తయారీ, హోటళ్లతోపాటు టీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. హోటళ్లలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను తయారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తుంపర్ల ద్వారా కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికులు మాస్క్‌లు ధరించడం లేదు. పట్టణంలో టిఫిన్ సెంటర్లతో పాటు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, హోటళ్లు, వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న కార్యాలయాల్లో ఆరంభంలో హడావిడి చేసిన అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు. గతంలో మాస్కులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న కొందరికి జరిమానా వేశారు. పట్టణంలో కోవిడ్ వ్యాప్తి చెందకముందు చర్యలు తీసుకున్న అధికారులు ప్రస్తుతం మూడు కోవిడ్ కేసులు నిర్ధారణ అయినా దృష్టిసారించడం లేదు. పట్టణంలో కోవిడ్ నియంత్రణ కోసం నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
బిర్యానీ లేదన్నందుకు రెచ్చిపోయారు..!
-
బిర్యానీ లేదన్నందుకు రెచ్చిపోయారు.. వైరల్ వీడియో!
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యకర్తలు బరితెగించారు. కేవలం బిర్యానీ లేదని చెప్పినందుకు ఓ హోటల్ నిర్వాహకులను చితకబాదారు. డీఎంకే అధినేత, కురువృద్ధుడు ఎం కరుణానిధి ఆరోగ్యం విషమించి.. ఆస్పత్రిలో చేరిన రోజే.. డీఎంకే కార్యకర్తలు ఇలా రౌడీయిజానికి దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చెన్నై విరుగంబాకంలోని ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ హోటల్లో ఐదురోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎంకే కార్యకర్తలు హోటల్‌కు వచ్చి తమకు బిర్యానీ కావాలని ఆర్డర్ చేశారు. అయితే, బిర్యానీ లేకపోవడంతో అదే విషయాన్ని వారికి హోటల్ సిబ్బంది చెప్పారు. దీంతో డీఎంకే కార్యకర్తలు చెలరేగిపోయి.. హోటల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి.. వారిని చితకబాడారు. కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా డీఎంకె కార్యకర్తలను గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలపై డీఎంకే వేటువేసింది. -
ఐటీ జోన్లో ఆకతాయిల వీరంగం
సాక్షి, సిటీబ్యూరో: సోమవారం అర్ధరాత్రి ఐటీ జోన్లో బైక్‌పై ‘స్వైర విహారం’ చేసిన ఇద్దరు యువకులు వరుస దాడులకు పాల్పడ్డారు. ఓ హోటల్ సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరో రెండు ప్రాంతాల్లో నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..సోమవారం రాత్రి దుర్గం చెరువు సమీపంలోని ‘సంప్రదాయ రుచులు’ రెస్టారెంట్‌ను మూసివేసిన అనంతరం సిబ్బంది రెస్టారెంట్‌ను శుభ్రం చేసే పనిలో ఉన్నారు. 11.40 గంటల ప్రాంతంలో మాదాపూర్ ఠాణా వైపు నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లోపలకు దూసుకువచ్చిన వారు ఫర్నిచర్, కంప్యూటర్ మానిటర్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు. రెస్టారెంట్ బయట ఉన్న ఓ వాహనాన్ని కిందకు తోశారు. దీనిపై సమాచారం అందడంతో రెస్టారెంట్ యజమాని ఈశ్వర్ మాదాపూర్ ఠాణాకు వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన గస్తీ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాయి. ఈ లోగా ముందుకు వెళ్లిన ఆ ఇద్దరూ ఇనార్బిట్ మాల్ సమీపంలో భార్యభర్తలపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పై దాడి చేశారు. ఈ నలుగురు బాధితుల గస్తీ బృందాలకు సమాచారం ఇచ్చినా లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదు. ఈశ్వర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు రెస్టారెంట్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. వాహనం నెంబర్ గుర్తించి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరూ మద్యం మత్తులోనో, డ్రగ్స్ ప్రభావంతోనో అలా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
వెంబడించి 15నిమిషాల్లో సెల్‌ఫోన్ దొంగల పట్టివేత
సాక్షి, అన్నానగర్: సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరు యువకులను 15 నిమిషాల్లో వెంబడించి పట్టుకున్న సంఘటన మైలాపూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చేసుకుంది. చెన్నై మైలాపూర్ ముండక్కన్నియమ్మన్ ఆలయ వీధిలో ఆదివారం రాత్రి 9.45 గంటల సమయం 40 ఏళ్ల ఓ వ్యక్తి సెల్ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ బైకులో వచ్చిన ఇద్దరు యువకులు అతని సెల్‌ఫోన్‌ని లాక్కొని పరారయ్యారు. అటుగా వెళ్తున్న ఓ హోటల్ అధికారి ధైర్యంగా ఆ యువకులను వెంబడించి మైలాపూర్‌లో బీఎస్ శివస్వామి రోడ్డులో ఉన్న దుకాణం ముందు పట్టుకున్నాడు. స్థానికుల సాయంతో ఇద్దరు యువకులను పోలీసు స్టేషన్‌కి తీసుకుని వెళ్లి విచారణ చేశారు. ఓ నిందితుడు రాయపేటకి చెందిన యువకుడు కాగా, మరొకరు తిరువల్లికేని వాసి అని సమాచారం. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ చోరీ చేసిన దుండగులను ధైర్యంగా వెంబడించి 15 నిమిషాల్లో పట్టుకున్న హోటల్ అదికారిని స్థానికులు ప్రశంసించారు. -
విశాఖలో ఫుడ్ ఫెస్టివల్ కోసం వినూత్న ప్రచారం
-
టూరిస్టుల పట్ల దురుసు ప్రవర్తన
-
ఫైవ్‌స్టార్ హోటల్లో గ్యాస్ పేలుడు, 14మందికి గాయాలు
లండన్: సెంట్రల్ లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. లండన్‌లోని పోర్ట్మాన్ స్క్వేర్, చర్చిల్ హైయత్ రీజెన్సీ సమీపంలో శనివారం రాత్రి 11. 40 (బ్రిటిష్ కాలమానం ప్రకారం) గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 14మందికి గాయాలయినట్టు అక్కడి స్కాట్లాండ్ యార్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే గాయపడిన వారంతా హోటల్ సిబ్బందిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న 80మంది అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. రెస్క్యూ టీం సహా సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పేలుడు సంభవించడంతో హోటల్లో ఉన్న అతిథులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. దాంతో హోటల్లో ఉన్న 500 మంది అతిథులను హోటల్ సిబ్బంది ఖాళీ చేయించినట్టు తెలిసింది. ఈ హోటల్లో 400 లకు పైగా గదులు ఉన్నాయి. కాగా, గ్యాస్ లీక్ అవడానికి గల కారణాలను నిపుణులు దర్యాప్తు జరుపుతున్నారు.