
సాక్షి, అన్నానగర్: సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరు యువకులను 15 నిమిషాల్లో వెంబడించి పట్టుకున్న సంఘటన మైలాపూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చేసుకుంది. చెన్నై మైలాపూర్ ముండక్కన్నియమ్మన్ ఆలయ వీధిలో ఆదివారం రాత్రి 9.45 గంటల సమయం 40 ఏళ్ల ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ బైకులో వచ్చిన ఇద్దరు యువకులు అతని సెల్‌ఫోన్‌ని లాక్కొని పరారయ్యారు.
అటుగా వెళ్తున్న ఓ హోటల్ అధికారి ధైర్యంగా ఆ యువకులను వెంబడించి మైలాపూర్‌లో బీఎస్ శివస్వామి రోడ్డులో ఉన్న దుకాణం ముందు పట్టుకున్నాడు. స్థానికుల సాయంతో ఇద్దరు యువకులను పోలీసు స్టేషన్‌కి తీసుకుని వెళ్లి విచారణ చేశారు. ఓ నిందితుడు రాయపేటకి చెందిన యువకుడు కాగా, మరొకరు తిరువల్లికేని వాసి అని సమాచారం. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ చోరీ చేసిన దుండగులను ధైర్యంగా వెంబడించి 15 నిమిషాల్లో పట్టుకున్న హోటల్ అదికారిని స్థానికులు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment