తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ప్రభుత్వం అడ్డుకట్టవేయాల్సిన అవసరముందని డీఏంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. జయలలిత అనారోగ్యంకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.