
ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి స్పందించారు. ఇదే తుది తీర్పు కాదని వ్యాఖ్యానించారు.
ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు చివరిది కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టులను మించిన కోర్టు మనస్సాక్షి అని మహాత్మగాంధీ అన్నారని విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా కోర్టు తీర్పుపై జయలలిత ప్రశంసలు కురిపించారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తానని చెప్పారు.