'నాకున్న ఆస్తి నా ఇద్దరు భార్యలే'
చెన్నై: తనకున్న ఆస్తి తన ఇద్దరు భార్యలేనని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తన ఆస్తులకు సంబంధించిన వివరాలను సమర్పించారు.
తనకు స్థిరాస్తులు, వ్యవసాయ భూములు లేవని ఆయన పేర్కొన్నారు. తనకున్న ఆస్తి ఇద్దరు భార్యలు దయాళు అమ్మాళ్, రాజాత్తి అమ్మాళ్‌లు మాత్రమేనని తెలిపారు. తన భార్యల ఆస్తుల విలువ రూ.62.99 కోట్లని చెప్పారు. రెండో భార్య రాజాత్తి అమ్మాళ్‌కు రూ.11.94 కోట్ల అప్పున్నట్లు పేర్కొన్నారు. 2014-15లో తన ఆదాయం రూ. 1.21 కోట్లు మాత్రమేనని, తన చేతిలో ప్రస్తుతం రూ .50 వేలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే తన చరాస్తులు అన్ని కలిపి రూ.13.42 కోట్లుగా చూపించారు.
92 ఏళ్ల కరుణానిధి తిరువరూర్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. తన భార్యల ఆస్తుల విలువ రూ.41.13 కోట్లుగా 2011 ఎన్నికల్లో చూపించారు.