రాజాను బలిపశువును చేస్తే చూస్తూ ఊరుకోం: కరుణ
రాజాను బలిపశువును చేస్తే చూస్తూ ఊరుకోం: కరుణ
Published Thu, Sep 5 2013 10:21 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
టెలికాం కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాను బలిపశువును చేస్తే సహించేది లేదని డీఎంకే పార్టీ మరోసారి స్పష్టం చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏ రాజా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
'ఏ ఒక్కరు కూడా బలిపశువు కాకూడదు. ఎవరైనా రాజాను బలిపశువుగా చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు' అని డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి మీడియాతో అన్నారు.
ఈ కుంభకోణంలో జాయింట్ పార్లమెంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో మరొకరిని నియమిస్తారా అనే ప్రశ్నకు కరుణానిధి ఘాటుగా స్పందించారు. రాజ్యసభలో బలాబలాల ఆధారంగానే జేపీసీలో తమ పార్టీ సభ్యుడికి స్థానం లభించింది అని.. ఈ కేసులో తుది నివేదిక త్వరలో వెల్లడి కానుందని కరుణానిధి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పందం గురించి రాహుల్ గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళి చర్చలు జరిపారనే వార్తను కరుణానిధి ఖండించారు. అందులో వాస్తవం లేదని.. నీలాంటి మీడియా మిత్రుడు అందించిన వార్తలో వాస్తవం లేదు అని కరుణానిధి చురకలంటించారు.
Advertisement