అన్నయ్య భేటీపై స్పందించని తమ్ముడు
చెన్నై: తన అన్నయ్య ఎంకే అళగిరి.. ప్రధాని మన్మోహన్ సింగ్ను కలవడాన్ని అప్రాధాన్య వార్తగా కొట్టిపారేశారు ఆయన తమ్ముడు స్టాలిన్. అనవసరమైన వార్తలు చదవనని, అవసరంలేని వాటి గురించి పట్టించుకోనని చెప్పారు. అనవసర వార్తల గురించి చర్చించనని స్పష్టం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్తో అళగిరి భేటీ గురించి అడిగినప్పుడు ఆయనీవిధంగా స్పందించారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అళగిరికి డీఎంకే పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రధానితో ఆయన భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతుదారులతో అళగిరి చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ్ముడితో వారసత్వ పోరుగా కారణంగానే ఆయనకు టిక్కెట్ దక్కలేదు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అళగిరిపై డీఎంకే సస్పెన్షన్ వేటు కూడా వేసింది.