అధికారమే లక్ష్యంగా డీఎంకే కీలక భేటీ! | DMK strategy meeting at party headquarter in Chennai | Sakshi
Sakshi News home page

అధికారమే లక్ష్యంగా డీఎంకే కీలక భేటీ!

Published Mon, Feb 13 2017 6:26 PM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM

అధికారమే లక్ష్యంగా డీఎంకే కీలక భేటీ! - Sakshi

అధికారమే లక్ష్యంగా డీఎంకే కీలక భేటీ!

చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో రాజకీయ వ్యూహాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. పన్నీర్ సెల్వం, శశికళ మధ్య ‘సీఎం కుర్చీ’  కోసం పోరు జరుగుతుండగా విపక్షం డీఎంకే కూడా చర్చోప చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా సోమవారం పార్టీ సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించింది.

ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించింది. అన్నాడీఎంకేలో సంక్షోభంతో ఆ పార్టీ చీలిపోతే అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశంలో 11 తీర్మానాలను ఆమోదించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement