అధికారంలోకి వచ్చిన వెంటనే వేలూరుకు కావేరి నీరు
మహాధర్నాలో డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యలు
కావేరి కూట్టు తాగునీటి పథకాన్ని వెంటనే పూర్తి చేసి వేలూరు ప్రజలకు నీటిని అందజేయాలని కోరుతూ డీఎంకే ఆధ్వర్యంలో వే లూరు కలెక్టరేట్ ఎదుట స్టాలిన్ అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ గత డీఎంకే ప్రభుత్వ హయాంలో వేలూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1,295 కోట్ల వ్యయంతో హొగినేకల్ తాగునీటి పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేయడమే అన్నాడీఎంకే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని వేలూరులో జరిగిన మహా ధర్నాలో డీఎంకే పార్టీ రాష్ట్ర కోశాధికారి స్టాలిన్ పేర్కొన్నారు. కావేరి కూట్టు తాగునీటి పథకాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు నీటిని అందజేయాలని కోరుతూ డీఎంకే ఆధ్వర్యంలో వే లూరు కలెక్టరేట్ ఎదుట స్టాలిన్ అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. స్టాలిన్ మాట్లాడుతూ గత డీఎంకే ప్రభుత్వంలో వేలూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1,295 కోట్ల వ్యయంతో ఓక్కెనెకల్ తాగునీటి పథకాన్ని ప్రారంభించి అందుకు తానే శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ పథకం పూర్తి చేసి 2014లో ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని అసెంబ్లీలోనే కరుణానిధి తీర్మానం చేశారన్నారు.
అనంతరం మాజీ మంత్రి దురైమురగన్ ఆధ్వర్యంలో అధికారులతో చర్చించి పలు మార్లు సర్వేలు చేపట్టినట్లు వివరించారు. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వాటిని రద్దు చేసి కావేరి తాగునీటి పథకంగా పేరు మార్చి పనులు ప్రారంభించారన్నారు. ఈ పథకాన్ని 2012 డిసెంబర్‌కు పూర్తి చేసి ప్రజలకు తాగునీటిని సరఫరా చే యాలని అయితే ఐదేళ్లవుతున్నా 25 శాతం పనులు మాత్రమే చేశారన్నారు. ఇక్కడున్న మంత్రి, కలెక్టర్‌లు ఏప్రిల్లో నీటిని సరఫరా చేస్తామని తెలిపారన్నారు. డీఎంకే ప్రభుత్వంలో క్రిష్ణగిరి, ధర్మపురి జిల్లా ప్రజల తాగునీటి కోసం రూ: 1,828 కోట్ల కేటాయించి దాదాపు 75 శాతం పనులు పూర్తి చేయడంతో ప్రభుత్వం మారడంతో 25 శాతం పనులు పూర్తి చేయకుండా నిలుపుదల చేశారన్నారు. దీనిపై తాను క్రిష్ణగిరి ప్రజలతో చర్చించి ధర్నా చేస్తానని ప్రకటించడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభించారన్నారు.
2011-13 వరకు కావేరి తాగునీటి పథకం పనులు వేలూరు జిల్లాలో 21 శాతం మాత్రమే జరిగాయని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడేమో ఈ నెల 14వ తేదీ నుంచి కావేరి నీటిని సరఫరా చేస్తామని తెలుపుతున్నారన్నారు. అదెలా సాధ్యమో తెలపాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను పూర్తిగా రద్దు చేయడానికి అన్నాడీఎంకే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందన్నారు. వేలూరు కలెక్టర్ నందగోపాల్ కాట్పాడి సమీపంలో ఉగాది వేడుకలకు వెళ్లి సొంతంగా కారు నడిపి ప్రమాదానికి గురైతే ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై విచారణ చేపడతామన్నారు. కావేరి తాగునీటి పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని అసెంబ్లీలోను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో డీఎంకే పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దురైమురుగన్, జిల్లా కార్యదర్శులు నందకుమార్, గాంధీ, దేవరాజ్, కార్పొరేషన్ కార్యదర్శి కార్తికేయన్, పట్టణ కార్యదర్శి రామలింగం పాల్గొన్నారు.
డీఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభం
ధర్నా అనంతరం వేలూరు గ్రీన్ సర్కిల్ సమీపంలో డీఎంకే పార్టీ కార్యాలయాన్ని స్టాలిన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో చర్చించారు. ఆయనతో పాటు దురై మురుగన్, జిల్లా కార్యదర్శులు గాంధీ, నందకుమార్ ఉన్నారు.
కలెక్టరేట్ ఎదుట స్తంభించిన ట్రాఫిక్
సోమవారం కావడంతో వేలూరు కలెక్టరేట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో కూడిన విన్నపాలను సమర్పిస్తారు. డీఎంకే ధర్నాతో కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో వాహనాలు కలెక్టరేట్ చేరుకునేం దుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాహం తీర్చండి
Published Tue, Apr 7 2015 2:45 AM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM
Advertisement
Advertisement