
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం డీఎంకే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత స్టాలిన్ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. తమ పార్టీ తరపున మరుదు గణేశ్ పోటీ చేయనున్నట్లు స్టాలిన్ తెలిపారు.
జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్కే నగర్) బై ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఎన్నిక, 24న కౌంటింగ్ నిర్వహించనున్నారు.