ఆ తీర్పును నిషేధించండి
సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషిగా బైటపడడంపై డీఎంకే న్యాయ పోరాటానికి శ్రీకారం చు ట్టింది. జయ కేసులో తాజా తీర్పు పై నిషేధం విధించాలంటూ డీఎం కే సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. జయపై దాఖలైన ఆదాయానికి మిం చిన ఆస్తుల కేసు విచారణ కొన్నేళ్లు చెన్నైలో మరికొన్నేళ్లు బెంగళూరులో సాగింది. మొత్తం 18 ఏళ్లపాటు సాగిన విచారణ పూర్తికాగానే కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది.
జయతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు సైతం నాలుగే ళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా పడింది. తనపై వచ్చిన తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసి అనూహ్యరీతిలో జయలలిత నిర్దోషిగా బైటపడ్డారు. ఆపై జయ మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. జయ అవినీతే ప్రధాన అస్త్రంగా రాబోయే ఎన్నికల్లో రంగంలోకి దిగాలని ఆశించి భంగపడిన డీఎంకే, జయ ఆస్తుల కేసులో తాజాగా వెలువడిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని మేలో నిర్వహించిన పార్టీ కార్యదర్శుల సమావేశంలో తీర్మానించింది. డీఎంకే సీనియర్ న్యాయవాది వీజీ ప్రకాశం నెలరోజులుగా కసరత్తు చేసి పిటిషన్ సిద్ధం చేశారు.
పార్టీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రధాన కార్యదర్శి అన్బళగన్ పేరున సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయ సహా నలుగురు గ్రూపుగా మారి అక్రమాస్తులను కూడగట్టారని, ఈ వివరాలను కోర్టుకు వివరించినా ఎటువంటి కారణం చూపకుండా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారందరినీ నిర్దోషులుగా విడిచిపెట్టారని వివరించారు. జయను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఆ పిటిషన్‌లో కోరారు