
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ ఆర్‌ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఈ సినిమా ప్రేరణతో తమ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు రావటంతో మరోసారి ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సంఘటనపై హీరో కార్తికేయ స్పందించాడు. తమ సినిమాలో హీరో ఆత్మహత్య చేసుకునే సన్నివేశం అసలు లేదని.. క్లైమాక్స్‌లో కూడా ఇందునే హీరోను చంపిస్తుంది.. కానీ తాను బలవన్మరణానికి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమా దర్శకులు ఎప్పుడు తమ సినిమా చూపి చేడిపోండి అని తీయరు. విద్యార్థులు ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చుట్టుపక్కల వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
చదవండి :
ఆర్‌ఎక్స్ 100 సినిమానే ప్రేరణ