రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
బీర్కూర్ కామారెడ్డి : మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పాఠశాల గదులకు తాళాలు వేసి, బీర్కూర్ –పోతంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఒకటి నుంచి తొమ్మిది తరగతి వరకు 132 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, కనీసం ఒక్క ఉపాధ్యాయుడూ లేరని ఎస్‌ఎంసీ చైర్మన్ అశ్వాక్ ఖాన్ పేర్కొన్నారు.
గతేడాది ముగ్గురు విద్యావలంటీర్లను నియమించారని, ఈసారి ఒక్కరినీ ఇవ్వలేదని, ఇలాగైతే విద్యార్థులకు చదువు ఎలా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సర్దిచెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment