హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిత మంగళవారం తీర్పు చెప్పారు. 2022 ఆగస్టులో ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకోగా ఇన్‌స్పెక్టర్ జహంగీర్‌యాదవ్ నేతృత్వంలో ఎస్సై సురేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లా, బిచ్‌పల్లి మండలం, ధర్మారం గ్రామానికి చెందిన కొనగంటి శివకుమార్, నాగలక్ష్మి దంపతుతకు పవన్(7), భరత్‌కుమార్(3)లు అనే ఇద్దరు సంతానం. పెళ్లికి ముందేనాగలక్ష్మికి ఇదే జిల్లా మాధవనగర్ గ్రామానికి చెందిన ముస్తాల రవితో వివాహేతర సంబంధం ఉంది.
ఈ క్రమంలో రవి హైదరాబాద్ వచ్చి పార్సిగుట్ట మున్సిపల్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ వర్కర్‌గా పని చేసేవాడు. ఇదే సమయంలో నాగలక్ష్మి కూడా హైదరాబాద్ వెళ్లి ఏదో పని చేసుకుని బతుకుదామని భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్ తీసుకువచి్చంది. ఇద్దరు పిల్లలతో కలిసి రవి నివాసానికి కొద్ది దూరంలోని మోహన్‌నగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శివకుమార్‌కు రవి పెయింటర్‌గా పని ఇప్పించాడు. నాగలక్ష్మి పెద్ద కుమారుడు పవన్ స్కూల్‌కు వెళ్తుండగా చిన్న కుమారుడు భరత్(3) పక్కనే ఉన్న అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో రవి నాగలక్ష్మి ఇంటికి వచ్చి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు.
అయితే భరత్ తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి భర్త శివకుమార్‌తో రవికి ఫోన్ చేయించి అంగన్‌వాడీ సెంటర్‌లో ఉన్న తన చిన్న కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పించింది. దీంతో అతను భరత్‌ను ఇంటికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో అతడికి తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత రవి శివకుమార్‌కు ఫోన్ చేసి భరత్ కురీ్చపై నుంచి కిందపడ్డాడని తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో శివకుమార్ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎవరికీ అనుమానం రాకుండా నాగలక్ష్మి ఏడుస్తూ నటించింది. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం చేయించగా బాలుడి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి నాగలక్షి్మతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నాగలక్ష్మి, రవిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. విచారణ అనంతరం న్యాయస్థానం రవిని దోషిగా నిర్ధారిస్తూ యావజీవ కారాగార శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment