సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పనికిరాని అంశాలపై మాత్రమే స్పందిస్తుంటారని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ లవ్ జిహాద్ అంశంపై నగరంలో నిర్వహించిన ఓ సభలో ఒవైసీ స్పందించారు.
‘‘ వరుస ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నింటిపైనా ప్రసంగిస్తారు. తనపై ప్రతిపక్షాలు వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలను ఖండిస్తారు. కానీ, అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై అస్సలు నోరు మెదపరు. రాజస్థాన్‌లో జరిగిన అఫ్రజుల్ హత్య ఉదంతాన్ని దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఓ మతోన్మాది చేసిన దుశ్చర్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కానీ, మోదీ మాత్రం స్పందించలేదు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. 50 ఏళ్ల వ్యక్తి లవ్ జిహాద్ పాల్పడ్డాడన్న ఆరోపణ ఏ మాత్రం సమంజసం. కేవలం ముస్లింలు అన్న కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. వీటిని మౌనం వహించటం ఎంత వరకు సమంజసం? అని ఒవైసీ.. ప్రధానిని ప్రశ్నించారు.
కాగా, పశ్చిమ బెంగాల్‌కు అఫ్రజుల్ ఖాన్ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ ఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment