
సాక్షి,శ్రీకాకుళం: టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తురు మండలం కంటిబద్రలో దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. స్థానికంగా చోటుచేసుకున్న స్వల్ప వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి జంగం అనే వ్యక్తిని అత్యంత కిరాతంగా హత్యచేశారు. వారి దాడిలో మరో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని కొత్తురు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. టీడీపీ నేతలు దాష్టీకంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్‌సీపీ సీరియస్..
ఘటనపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ విజయసాయి రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment