
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు.
అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్‌కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్ రామ టాకిస్ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు
Comments
Please login to add a commentAdd a comment