ఢిల్లీ: పాకిస్థాన్‌లో జరిగిన పైశాచిక ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌లో మైనారిటీల(హిందూ, ఇతర ముస్లిమేతర మతాల) పరిరక్షణతో పాటు వాళ్ల భద్రత బాధ్యత కూడా అక్కడి ప్రభుత్వానిదేనని కుండబద్ధలు కొట్టింది.
తాజాగా.. సింజోరో పట్టణంలో బుధవారం ఓ హిందూ మహిళను ఘోరంగా హత్య చేశారు. 40 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిపి మరీ హత్య చేశారు. ఆపై వర్ణించడానికి వీల్లేని రీతిలో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. ఈ విషయాన్ని అక్కడి హిందూ సెనేటర్ కృష్ణ కుమారి ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Daya Bhel 40 years widow brutally murdered and body was found in very bad condition. Her head was separated from the body and the savages had removed flesh of the whole head. Visited her village Police teams from Sinjhoro and Shahpurchakar also reached. pic.twitter.com/15bIb1NXhl
— Krishna Kumari (@KeshooBai) December 29, 2022
ఈ ఘోర హత్యాచారోదంతంపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీకి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. పాక్ గడ్డపై ఉన్న మైనారిటీల పరిరక్షణ అక్కడి ప్రభుత్వానిదే. వాళ్ల బాగోగులు కూడా చూసుకోవాలి. గతంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాం. ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నాం అని ఆయన తెలిపారు. అయితే.. ప్రత్యేకించి ఆ కేసు ఇంకా ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు.
India calls on Pakistan to protect minorities after killing of Hindu women Daya Bheel in Sindh province https://t.co/c5nSo1ylWV pic.twitter.com/it5hun7Z4U
— Sidhant Sibal (@sidhant) December 29, 2022
Comments
Please login to add a commentAdd a comment