
నల్గొండ: వ్యవసాయ పనులకు కూలీలను సమకూర్చే ముఠామేసీ్త్ర దారుణహత్య కు గురయ్యాడు. రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామశివారులో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. హత్యోదంతంపై పరిసర గ్రామాల ప్రజలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కాసరబాద సమీప గ్రామం జమునానగర్‌కు చెందిన వానరాశి లింగయ్య(50) వ్యవసాయం, ఇతర పనులకు కూలీలను సమకూరుస్తూ ముఠామేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు.
తనకు అందుబాటులో ఉన్న కూలీలను పని లభించే ప్రాంతానికి తీసుకువెళ్లి ఉపాధి కల్పిస్తుంటాడు. సుమారు 35రోజుల క్రితం లింగయ్య తన కుటుంబ సభ్యులతో పాటు మరో 40మంది కూలీలతో రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి వచ్చాడు. అక్కడే ఓ రైతుకు చెందిన కోళ్లఫారంలో ఉంటూ నిదానపల్లి, తుమ్మలగూడెం గ్రామాల్లో పలువురి రైతులకు చెందిన పొలాల్లో వరినాట్లు వేయించాడు.
డబ్బుల కోసమే..?
లింగయ్యతోపాటు వచ్చిన కూలీలు తెల్లవార్లు అతని కోసం చెట్టుచేమా వెదికారు. శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో వ్యవసాయబావి వద్దకు వెళ్లిన తుమ్మలగూడేనికి చెందిన పవన్‌కు తమ పొలం సమీపంలో మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బండరాయితో తల,వీపుపై బలంగా మోదిన ఆనవాళ్లను గుర్తించారు. భువనగిరి నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
రైతుల నుంచి వచ్చిన కూలి డబ్బులు మొత్తం అతడి వద్ద రూ.10 నుంచి రూ.12లక్షల వరకు ఉంటాయని కూలీలు, కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆ డబ్బుల కోసమే దుండగులు లింగయ్యను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతుడికి భార్య సైదమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర, ట్రైనీ ఐపీఎస్ శివం ఉపాధ్యాయ, ఎసీపీ మొగులయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వారివెంట సీఐ మోతీరాం, ఎస్‌ఐలు లక్ష్మయ్య, ప్రభాకర్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించి, హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లాపాపలను వదిలి పొట్టచేతపట్టుకుని వస్తే అన్నంపెట్టే దేవుడిని హత్య చేశారని కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు.
కూరగాయలు తీసుకొని వెళ్తుండగా..
నాటు వేసే పనులు దగ్గర పడుతుండడంతో కూలీలకు కూలి డబ్బులు చెల్లించడానికి లింగయ్య రైతుల వద్ద నుంచి రావలసిన బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. గురువారం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన కొందరు రైతుల వద్ద రూ.3లక్షల వరకు వసూలు చేశాడు. అనంతరం లింగయ్య నిదానపల్లిలోని ఓ కిరాణషాపులో కూరగాయలు తీసుకొని తన టీవీఎస్ ఎక్స్‌ల్‌పై చిట్యాల–భువనగిరిరోడ్డు నుంచి కూలీలు ఉండే చోటుకు బయలుదేరాడు.
నిదానపల్లి శివారుకు వెళ్లగానే దుండగులు అతడి తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే కూప్పకూలి మృతిచెందాడు. అనంతరం దుండగులు అతని బైక్ డిక్కీలో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు. బయటికి వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం పొద్దుపోయే వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు, కూలీలు అతడికి ఫోన్‌చేసినా లిఫ్ట్ చేయలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ తెలియలేదు. అదేరోజు రాత్రి లింగయ్య కుమారుడు మహేష్ తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫ బండరాయితో తలపై మోది ఘాతుకం
ఫ హతుడి బైక్ డిక్కీలో కనిపించని రైతుల వద్ద వసూలు చేసిన రూ.లక్షలు
ఫ డబ్బుల కోసమే అంతమొందించి ఉంటారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
ఫ రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ శివారులో దారుణం
Comments
Please login to add a commentAdd a comment