ఖమ్మం: పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి గొడ్డళ్లతో మెడపై నరికి హత్య చేసిన ఘటన కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి (49) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నాయకన్‌గూడెం నుంచి పాఠశాలకు బైక్‌పై వెళుతూ హత్యకు గురయ్యాడు.
కారుతో బైక్‌ను ఢీకొట్టి..
వెంకటచారి బైక్ పై వెళుతుండగా నాయకన్‌గగూడెం శివారులో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో వెంకటాచారి కిందపడగా కారులోని వారితో పాటు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి అతని మెడపై గొడ్డలితో నరికి పరారైనట్లు స్థానిక రైతులు తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకే బైక్ రావడం సీసీ పుటేజీల్లోనూ కనిపించడంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు.
అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్‌గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించగా దాన్ని ప్రస్తుతం నడపటం లేదు. ఆ భవనాలను గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్‌రెడ్డి , ఎస్పై రమేష్‌కుమార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, దుండగులు పరారు కావడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు. వెంకటాచారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment