
సాక్షి, విశాఖపట్నం : ఓ వివాహితను దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని నరవకొత్తపాలెం నరవలో చోటుచేసుకుంది. వివరాలివి.. దుండగులు ఓ మహిళను హత్య చేసి, గుర్తు పట్టకుండా తగలబెట్టేశారు. ఆమె మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు.
అప్రమత్తమైన గ్రామస్తులు విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ ఇంతవరకూ మహిళ ఎవరనేది పోలీసులు గుర్తించలేదు. సంఘటన స్థలాన్ని ఏసీపీ అర్జున్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ..
నరవలో జరిగిన మహిళ దారుణ హత్యకు నిరసన తెలుపుతూ తాటిచెట్ల పాలెంలో ఐద్వా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంతేకాక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మహిళ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.