సాక్షి, నల్లగొండ: జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త, పార్టీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణహత్యను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి ఉత్తమ్ వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన విలేకరులకు తెలిపారు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు అమానుషమని మండిపడ్డారు. రాజకీయ కక్షల కారణంగానే శ్రీనివాస్ హత్య జరిగినట్టు భావిస్తున్నామని తెలిపారు.
తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గతంలోనే శ్రీనివాస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే తగినవిధంగా బదులు ఇస్తామని ఆయన హెచ్చరించారు. శ్రీనివాస్ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం నల్లగొండకు వెళ్లనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన నల్లగొండకు బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment