
యాలాల(తాండూరు): రూ.20వేల కోసం ఓ వ్యక్తిని తోటి స్నేహితులే దారుణంగా హత్య చేశారు. గుప్తనిధులు వెలికితీద్దామని వెళ్లి అతడి జేబులో డబ్బులను గమనించి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం గుంతలో మృతదేహాన్ని పూడ్చివేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయిపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. వికారాబాద్ డీఎస్పీ స్వా మి, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపిన వి వరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేం ద్రానికి చెందిన మందా శ్యామ్యూల్ (27) కొన్నేళ్ల క్రితం వికారాబాద్‌కు వలస వచ్చాడు. ఇక్కడే మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్యామ్యూల్‌కు యాలాల మండలం రాస్నంతండాకు చెందిన శివరాజు, పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన చందర్, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతవాసి పాషాతో పరిచయం ఏర్పడింది.
వీరందరూ మేస్త్రీలు కావ డంతో స్నేహితులయ్యారు. ఇదిలా ఉండగా.. శ్యామ్యుల్ అవసర నిమి త్తం ఇటీవల తండ్రి చిన్నయ్య నుంచి రూ. 25 వేల తెచ్చుకున్నాడు. గుర్తిం చిన పాషా.. ఈవిషయాన్ని శివరాజు, చందర్‌లకు చెప్పాడు. ఎలాగైనా సరే.. శ్యామ్యూల్ వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే.. రాస్నం శివారులోని సంగాయిపల్లి తండాలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని వెలికి తీద్దామని పథకం వేశారు. వారంరోజుల క్రితం రాస్నం శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుప్తనిధుల కోసం గుంతను తవ్వారు. అక్కడే శ్యామ్యూల్‌తో పూజలు కూడా చేయించారు.
అదను చూసి అతడిపై కట్టెతో బలంగా బాది అతడి వద్ద ఉన్న రూ. 25 వేలు తీసుకున్నారు. అనంతరం అదే గుంతలో శ్యామ్యూల్‌ను పూడ్చి పెట్టారు. శ్యామ్యూల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి కనిపించడం లేదని మృతుడి తండ్రి ఈనెల 2వ తేదీన వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అనుమానంతో శ్యామ్యూల్ స్నేహితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా పైవిషయాలు వెల్లడించి నేరం అంగీకరించారు.
నిందితులను మంగళవారం సాయం త్రం సంగాయిపల్లి తండా శివారులో సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. వికారాబాద్ తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, డీఎస్పీ, సీఐ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. యువకుడి హత్య విషయం స్థానికంగా తెలియడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. త్వరలో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment