
నల్లగొండ క్రైం: నల్లగొండలో మరో కిరాతక హత్య జరిగింది. మునిసిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసు గురించి మరవకముందే ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టణంలోని భారత్‌గ్యాస్ గోదాం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి కనగల్ మండలానికి చెందిన పాలకూరి రమేశ్ (32)ను దారుణంగా హత్య చేసి తల, మొండాన్ని వేరు చేశారు. తలను స్థానిక బొట్టుగూడలో ఓ సామాజిక వర్గానికి చెందిన దిమ్మెపై పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రమేశ్, అనిత భార్యాభర్తలు. అనిత కనగల్‌కి చెందిన రాయల రామకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఐదు నెలలపాటు అతనితో వెళ్లిపోయింది.
అనితను సర్దిచెప్పి తీసుకొచ్చిన పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు. రెండు నెలలుగా రామకృష్ణకు అనిత దూరం కావడంతో ..రమేశ్‌ను అడ్డు తొలగించుకునేందుకు స్నేహితుడైన పాత నేరస్తుడు మోసిన్‌ఖాన్‌తో చేతులు కలిపాడు. ఇతను నయాబ్‌కు విషయం చెప్పి ఇద్దరు కలసి హత్యకు పథకం పన్నారు. అప్పటికే మోసిన్‌ఖాన్‌కు రమేశ్ పరిచయం ఉండటంతో ఆదివారం రాత్రి ఇద్దరు కలసి మందు తాగారు. అనంతరం రమేశ్‌ను కత్తితో గొంతులో పొడిచి చంపారు. నిందితులు మోసిన్‌ఖాన్, నయాబ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment