టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. శ్రీకాకుళం జిల్లా కొత్తురు మండలం కంటిబద్రలో దారుణ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. స్థానికంగా చోటుచేసుకున్న స్వల్ప వివాదాన్ని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ కార్యకర్తలు బల్లెంతో పొడిచి జంగం అనే వ్యక్తిని అత్యంత కిరాతంగా హత్యచేశారు. వారి దాడిలో మరో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.